Jagan: నన్ను చూడగానే నందిగం సురేశ్ ఏడ్చాడు: జగన్

Jagan told Nandigam Suresh cried in jail

  • నందిగం సురేశ్ ను గుంటూరు జైల్లో పరామర్శించిన జగన్
  • నందిగం సురేశ్ తో ఏం మాట్లాడిందీ వెల్లడించిన జగన్
  • దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యలు

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. జైలు వెలుపల జగన్ మీడియాతో మాట్లాడుతూ, జైలు లోపల నందిగంతో తాను ఏం మాట్లాడిందీ వివరించారు. సురేశ్ ను ఆరోగ్యపరంగా తానేమీ అడగలేదని, కుశల ప్రశ్నలు మాత్రమే వేశానని వెల్లడించారు. 

"నన్ను చూడగానే నందిగం సురేశ్ ఏడ్చాడు. ధైర్యంగా ఉండు అని చెప్పాను. తన భార్య కూడా నాతోనే జైలు లోపలికి వచ్చింది కాబట్టి... వాళ్ల కుటుంబ విషయాలు, పిల్లలు, పిల్లల చదువులు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడంపై మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది. వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్లు ఏం చేసినా... దేవుడు ఉన్నాడు, ఆయనే మొట్టికాయలు వేస్తాడు" అని జగన్ వివరించారు.

More Telugu News