Ola Showroom: తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూమ్ ను తగలబెట్టాడు!

Man set fire Ola showroom in Karnataka

  • కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలో ఘటన
  • ఇటీవల ఓలా స్కూటర్ కొనుగోలు చేసిన నదీమ్ అనే యువకుడు
  • మూడు వారాలకే స్కూటర్ లో సాంకేతిక సమస్య
  • షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ యువకుడి ఆగ్రహం
  • షోరూమ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం

కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన స్కూటర్ రిపేర్ చేయలేదన్న కారణంతో ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్ నే తగలబెట్టాడు. 

కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్ లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలు చేశాడు. మూడు వారాలు తిరగకముందే స్కూటర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్ ను ఓలా షోరూమ్ కు తీసుకెళ్లాడు. 

అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓలా షోరూమ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో, షోరూమ్ లోని 6 స్కూటర్లు దగ్ధమయ్యాయి. 

షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నదీమ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓలా షోరూమ్ తగలబడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

More Telugu News