Raja Singh: గణేశ్ నిమజ్జనం... పోలీస్ కమిషనర్‌కు రాజాసింగ్ లేఖ

Raja Singh writes letter to Hyderabad CP

  • మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని సూచన
  • నిమజ్జనానికి ఎవరూ మద్యం సేవించి రావొద్దన్న రాజాసింగ్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గత ఏడాది గణేశ్ నిమజ్జనం సమయంలో కొంతమంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని తెలిపారు. నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వినాయక నిమజ్జనానికి ఎవరు కూడా మద్యం సేవించి రావొద్దని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన కార్యక్రమం భక్తిభావంతో జరగాలని సూచించారు. మద్యం తాగి ఇష్టారీతిన ప్రవర్తించే వారిని ఉపేక్షించరాదని లేఖలో పేర్కొన్నారు. ధర్మద్రోహులు కూడా ఉంటారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. 

More Telugu News