Stock Market: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

Sensex closes down by 398 points

  • 398 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 24 వేల పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ
  • నష్టాల్లో ముగిసిన టాటా స్టీల్స్, రిలయన్స్, మహీంద్రా, విప్రో స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398 పాయింట్లు క్షీణించి 81,523 వద్ద... నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 24,918 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ బ్యాంకు 262 పాయింట్లు క్షీణించి 51,010 వద్ద ముగిసింది.

సెన్సెక్స్-30 స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, విప్రో, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్స్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

రంగాలవారీగా చూస్తే ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, మెటల్, రియాల్టీ, ఎనర్జీ లాభపడగా... ఎఫ్ఎంసీజీ, వినియోగ రంగాలు నష్టపోయాయి. 

యూఎస్ వినియోగ ద్రవ్యోల్బణం డేటాకు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తత పాటించారని, అందుకే మార్కెట్ నష్టాల్లో ముగిసిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ విద్వాని తెలిపారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయంపై యూఎస్ వినియోగ ద్రవ్యోల్బణ డేటా ప్రభావం ఉంటుందన్నారు.

Stock Market
Share Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News