HYDRA: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా నివేదిక

Hydra says demolished 262 buildings

  • 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపిన హైడ్రా
  • 111.72ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్న హైడ్రా
  • చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది.

హైడ్రా కూల్చివేతల వివరాలు...

మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో- 42 అక్రమ నిర్మాణాలు
అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో- 24 
గగన్ పహాడ్ అప్పా చెరువు పరిధిలో- 14
దుండిగల్ కత్వా చెరువు పరిధిలో-  13
రామ్ నగరమ మణెమ్మ గల్లీ- 3 అక్రమ నిర్మాణాలు
ఇతర ప్రాంతాల్లో- 166 అక్రమ నిర్మాణాలు

HYDRA
Telangana
Hyderabad
Congress
  • Loading...

More Telugu News