Pawan Kalyan: తెలంగాణ సీఎంను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం

AP Dy CM Pawan Kalyan meets Telangana CM Revanth Reddy

  • బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పవన్ కల్యాణ్
  • వరద బాధితుల సహాయం కోసం రూ.కోటి చెక్కు అందజేత
  • సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించిన నేతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్.. సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని వరద బాధితులకు ఇటీవల ఆయన రూ. కోటి విరాళం ప్రకటించారు. తాజాగా బుధవారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం.

Pawan Kalyan
AP Dy CM
Telangana
CM Revanth Reddy
Flood Donation
  • Loading...

More Telugu News