Raviteja: రేపు ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

OTT Movies Update

  • రేపు నెట్ ఫ్లిక్స్ కి వస్తున్న 'మిస్టర్ బచ్చన్'
  •  అదే సెంటర్ లో అడుగుపెడుతున్న 'ఆయ్'
  • ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి 'కమిటీ కురోళ్లు'
  • సోనీలివ్ నుంచి 'బెంచ్ లైఫ్' తెలుగు సిరీస్   


ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై రేపు గట్టిగానే సందడి కనిపించనుంది. మంచి కంటెంట్ ఉన్న తెలుగులో సినిమాలతో పాటు, క్రేజ్ ఉన్న అనువాదాలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ జాబితాలో ముందుగా మనకి 'మిస్టర్ బచ్చన్' కనిపిస్తోంది. పీపుల్ మీడియా - టి సిరీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రవితేజ - భాగ్యశ్రీ బోర్సే - జగపతిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. రేపటి నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.   ఇక అదే రోజున 'నెట్ ఫ్లిక్స్' సెంటర్లో మరో తెలుగు సినిమా అడుగుపెట్టనుంది. ఆ సినిమా పేరే 'ఆయ్'. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. నార్నె నితిన్ - నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా, కామెడీ కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ రోజునే 'ఈటీవీ విన్' ద్వారా 'కమిటీ కుర్రోళ్లు' ఆడియన్స్ ను పలకరించనుంది. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఆగస్టు 9న విడుదలై థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.   ఇక రేపే 'బెంచ్ లైఫ్' అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైభవ్ .. రితిక సింగ్ .. చరణ్ పేరి ప్రధామైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి మానస శర్మ దర్శకత్వం వహించారు. రేపటి నుంచి 'సోనీ లివ్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 13వ తేదీన 'రఘుతాత' సినిమాను 'జీ 5' ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, సుమన్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వస్తోంది.  

More Telugu News