YS Jagan: నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ఇలా..!

ys jagan guntur today

  • గంటూరు జైలులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించనున్న జగన్
  • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న సురేశ్
  • ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాంబిరెడ్డినీ పరామర్శించనున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ నిన్న సాయంత్రం బెంగళూరు నుండి తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి గుంటూరు సబ్ జైల్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అండర్ ట్రైల్ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ పరామర్శిస్తారు. 

అనంతరం అక్కడ నుండి బయలుదేరి ఎస్‌వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.

YS Jagan
YSRCP
Nandigam Suresh
jagan guntur tour
  • Loading...

More Telugu News