RBI: ఆ రెండు బ్యాంకులపై కొరడా ఝళిపించిన ఆర్బీఐ

rbi penalty on axis hdfc for not complying with directives

  • చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనల ఉల్లంఘన 
  • యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్
  • యాక్సిస్ బ్యాంకుకు రూ.1.91 కోట్ల జరిమానా  
  • హెచ్‌డీఎఫ్‌సీకి కోటి జరిమానా విధించిన ఆర్బీఐ  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెండు ప్రైవేటు బ్యాంకులపై కొరడా ఝళిపించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆదేశాలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీగా జరిమానా విధించింది. ఈ రెండు బ్యాంకులకు కలిపి రూ.2.91 కోట్ల జరిమానా విధిస్తూ ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.  
 
డిపాజిట్లపై వడ్డీ, బ్యాంక్ రికవరీ ఏజంట్లు, బ్యాంకు కస్టమర్ సర్వీసులకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ, కేవైసీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోవడంపై యాక్సిస్ బ్యాంక్ కు రూ.1.91 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.

More Telugu News