Chandrababu: పది రోజుల తర్వాత కలెక్టరేట్ నుంచి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు

CM Chandrababu arrives Undavalli residence from district collectorate after 10 days

  • విజయవాడలో వరద బీభత్సం
  • కలెక్టరేట్ నుంచే కార్యకలాపాలు సాగించిన చంద్రబాబు
  • సాధారణ స్థితికి చేరుకున్న వరద పరిస్థితులు

విజయవాడలో వరదలు సంభవించినప్పటి నుంచి జిల్లా కలెక్టరేట్ లోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు... కలెక్టరేట్ నే తన కార్యాలయంగా చేసుకుని పాలన నిర్వహించారు. నిద్రాహారాలన్నీ బస్సులోనే కొనసాగించారు.

వరద సహాయ చర్యల్లో ప్రతి అంశాన్ని పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు 10 రోజుల తర్వాత తన నివాసానికి తిరిగి వచ్చారు. విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ నుంచి బయల్దేరిన సీఎం చంద్రబాబు కొద్దిసేపటి కిందట ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో వరద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 

కాగా, వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

More Telugu News