KIA Motors: సీఎం చంద్రబాబుకు రూ.3 కోట్ల విరాళం అందించిన కియా మోటార్స్

Chandrababu thanked KIA Motors India for their huge donation

  • వరదలతో విజయవాడ అస్తవ్యస్తం
  • ఏపీ ప్రభుత్వానికి విరివిగా విరాళాలు
  • భారీ విరాళంతో ముందుకొచ్చిన కియా మోటార్స్

విజయవాడలో వరద విలయం పట్ల అన్ని వర్గాలు పెద్ద మనసుతో స్పందిస్తున్నాయి. వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వానికి భారీగా విరాళాలు వస్తున్నాయి. 

తాజా కియా మోటార్స్ ఇండియా విభాగం భారీ విరాళంతో ముందుకొచ్చింది. రూ.3 కోట్ల విరాళాన్ని ఇవాళ కియా మోటార్స్ సీఏఓ కాబ్ డాంగ్ లీ, ఆయన బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించింది. ఈ విషయాన్ని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కియా మోటార్స్ కంపెనీ ఉదారంగా స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించినట్టు వివరించారు. 

వరద బాధితులకు సాయం చేసే క్రమంలో మీరందించిన విరాళం ఎంతో సాయపడుతుందని కియా మోటార్స్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అటు, ఎల్జీ కెమ్ సంస్థ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం అందించింది. ఎల్జీ కెమ్ గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పాల్ క్వాన్ సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు.

More Telugu News