Bandi Sanjay: కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ కోసం... రైల్వే శాఖ మంత్రికి బండి సంజయ్ లేఖ

Bandi Sanjay writes letter to Union Railway Minister

  • ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి
  • జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా చూడాలన్న బండి సంజయ్
  • ఆయా రైల్వే స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని కోరారు. జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61.8 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే లైన్‌కు రూ.1,415 కోట్ల వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ సిద్ధమైందన్నారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

ఈ కొత్త రైల్వే నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కరీంనగర్, వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఇరుప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 

రైల్వే స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని, పార్కింగ్ ప్రాంతాన్ని విస్తరించాలని కోరారు. టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు.

More Telugu News