Boats: ప్రకాశం బ్యారేజి వద్ద భారీ క్రేన్లతో బోట్ల తొలగింపు పనులు ప్రారంభం

Works started of boats removal at Prakasam Barrage

  • ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను ఢీకొట్టిన బోట్లు
  • గేట్ల వద్దే చిక్కుకుపోయిన బోట్లు
  • క్రేన్ల ద్వారా వాటిని తొలగించే యత్నం

ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను ఢీకొట్టి నిలిచిపోయిన బోట్లను తొలగించేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఇంజినీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకువచ్చి బోట్ల తొలగింపు చర్యలు షురూ చేశారు. ఈ క్రేన్లు 50 టన్నుల బరువును ఎత్తే సామర్థ్యం కలిగినవి. 

బోల్తా పడిన స్థితిలో ఉన్న ఆ పడవలను తొలుత క్రేన్ల ద్వారా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం వాటిని తెరిచి ఉంచిన గేట్ల ద్వారా నీటితో పాటు దిగువకు పంపాలన్నది ఇంజనీర్ల ప్రణాళిక. ప్రస్తుతం బ్యారేజి వద్ద దిగువకు 2.09 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళుతోంది. 

ప్రకాశం బ్యారేజి వద్ద 67, 68, 69 నెంబరు గేట్ల వద్ద 4 బోట్లు చిక్కుకుపోవడం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన ఈ బోట్లు బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. దాంతో ఏపీ ప్రభుత్వం 67, 69 నెంబరు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చింది.

More Telugu News