Godavari River: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం

Godavari water level raising fastly

  • 48 అడుగులకు చేరుకోగానే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు
  • ఉదయం ఏడున్నరకు 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి వేగంగా పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 47 అడుగులు దాటింది. సాయంత్రానికి 48 అడుగులకు చేరుకుంటుందని భావిస్తున్న అధికారులు... అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో వరద నీరు పెరుగుతుండటంతో సాయంత్రానికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా పెరిగింది.

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Godavari River
Floods
Telangana
  • Loading...

More Telugu News