Nara Lokesh: ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేదే జగన్ లక్ష్యం: నారా లోకేశ్

Nara Lokesh severe allegations on Jagan

  • ఇటీవల ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు
  • గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణమయ్యారన్న లోకేశ్
  • ఇప్పుడు మరో కుట్ర పన్నారని వెల్లడి
  • ప్లాన్ జగన్ ది... అమలు చేసింది తలశిల, నందిగం అని వివరణ 

ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. 

"గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ ను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారు. 50 మందిని చంపేసి, ఐదు గ్రామాలను నామరూపాల్లేకుండా చేశారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజిని ఇనుప పడవలతో ఢీకొట్టి కూల్చాలన్ని కుట్ర చేశారు. 

విజయవాడతో పాటు  పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాల్లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడింది. ప్రజలను జలసమాధి చేయాలన్న కుట్రకు ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే... ఆ ప్రణాళికను అమలు చేసింది తలశిల రఘురాం, నందిగం సురేశ్" అంటూ నారా లోకేశ్ వివరించారు. 

తమ కుట్రలు బయటపడకుండా... వరద ముంపునకు కారణం ప్రభుత్వమే అంటూ సైకో జగన్ ముఠా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

Nara Lokesh
Jagan
Prakasam Barrage
Boats
TDP
YSRCP
Vijayawada
  • Loading...

More Telugu News