Nitya Menon: నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే: నిత్యా మీనన్

I am not Malayali says Nitya Menon

  • తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని చెప్పిన నిత్యా మీనన్
  • తాము బెంగళూరుకు చెందిన వాళ్లమని వెల్లడి
  • పాస్ పోర్ట్ కోసం పేరు వెనుక మీనన్ పెట్టుకున్నాన్న నిత్య

అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. దక్షిణాది భాషలన్నిట్లోనూ నటించిన నిత్య... బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటోంది. జాతీయ ఉత్తమ నటిగా కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. 'తిరుచిత్రాంబలం' చిత్రంలో నటనకు గాను ఆమెను బెస్ట్ యాక్ట్రెస్ గా ఎంపిక చేశారు. 

మరోవైపు నిత్యా మీనన్ అనగానే అందరూ ఆమెను మలయాళీ అనుకుంటారు. కానీ, అది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమది మలయాళీ కుటుంబం కాదని నిత్య తెలిపారు. తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని... ఎన్ అంటే తన తల్లి నళిని, ఎస్ అంటే తన తండ్రి సుకుమార్ అని చెప్పారు. వారి పేర్లలోని మొదటి అక్షరాలతో పేరు అలా పెట్టారని తెలిపారు. తమ కుటుంబంలో ఇంటి పేర్లు ఉండవని, కులాన్ని పేర్లతో ముడిపెట్టడం ఉండదని చెప్పారు. అయితే వృత్తిరీత్యా విదేశాల్లో తిరగాల్సి రావడంతో... పాస్ పోర్ట్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తన పేరు వెనుక మీనన్ ను జతచేశానని తెలిపారు. 

తన పేరు వెనుక మీనన్ ఉండటంతో అందరూ తనను మలయాళీ అనుకుంటారని నిత్య అన్నారు. వాస్తవానికి తాము బెంగళూరుకు చెందినవాళ్లమని చెప్పారు. మూడు తరాలుగా తమ కుటుంబం బెంగళూరులోనే ఉంటోందని తెలిపారు. స్కూల్ లో తన సెకండ్ లాంగ్వేజ్ కన్నడ అని చెప్పారు.

Nitya Menon
Tollywood
Kollywood
Bollywood
  • Loading...

More Telugu News