Payyavula Keshav: జీఎస్టీ మండలికి ఏపీ సర్కార్ 8 కీలక ప్రతిపాదనలు

Eight proposals from ap in gst Council meeting

  • కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
  • పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ప్రతిపాదనలు
  • వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని నిర్వాహకులను ఆహ్వానించిన మంత్రి పయ్యావుల

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం 54వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎనిమిది కీలక ప్రతిపాదనలు చేశారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని నిర్వాహకులను మంత్రి ఆహ్వానించారు. పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరతూ పయ్యావుల ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ది చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు. 

ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని కోరారు. మద్యం తయారీలో వినియోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. జీవిత, ఆరోగ్య బీమాలపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని పేర్కొన్నారు. వృద్ధులు, మానసిక వికలాంగులకు జీవిత, ఆరోగ్య బీమాలపై ఉన్న జీఎస్టీ పన్నును మినహాయించాలని పయ్యావుల ప్రతిపాదనలు చేశారు.

ఎలక్ట్రిక్ వాహానాల విడి భాగాలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి కుదించాలని కోరారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పైనా జీఎస్టీని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ రంగానికి జీఎస్టీ నుంచి వెసులుబాట్లు కల్పిస్తే పర్యావరణహిత సమాజం ఏర్పడడానికి  మరింత ఊతమిచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం సెక్షన్ 16(4) ఉన్న ఇబ్బందులను తొలగించి.. ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలని మంత్రి పయ్యావుల కోరారు. విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రొత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీని మినహాయించాలని పయ్యావుల ప్రతిపాదనల్లో కోరారు.

  • Loading...

More Telugu News