Chandrababu: చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది... ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra blames ysrcp for floods in Vijayawada

  • ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు నేడు చంద్రబాబు కష్టపడుతున్నారన్న మంత్రి
  • వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆగ్రహం
  • కేంద్రమంత్రులను పిలిపించుకొని వరద పరిస్థితులను వివరించారని వెల్లడి

వైసీపీ పాలనలో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆ రోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఈరోజు భారీ వరదల కారణంగా ప్రజలు కన్నీళ్లు పెట్టుకోకూడదని సీఎం నిత్యం కష్టపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోందన్నారు. నాడు ప్రతిపక్ష హోదాలో, నేడు సీఎంగా ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారన్నారు.

బుడమేరు కట్ట మీద మట్టిని దోచుకెళ్లారని, వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు. భారీ వరదల సమయంలో పడవలు తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. తొమ్మిది రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్‌లోనే ఉండి కేంద్రమంత్రులను పిలిపించుకొని వరద పరిస్థితులను వారికి వివరించినట్లు చెప్పారు.

ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం హెడ్ లైన్ అయిందేమో... కానీ ప్రజలు మాత్రం వైసీపీకి అధికారం లేకుండా చేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నాడు చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కేవలం అమరావతి మీదే కాదు... విజయవాడ మీద కూడా పగబట్టారన్నారు. రుషికొండపై సమీక్ష చేసిన జగన్ బుడమేరుపై కూడా సమీక్ష చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News