Akshay Kumar: స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో అక్ష‌య్ కుమార్‌కు 'క‌న్న‌ప్ప' టీమ్ బ‌ర్త్ డే విషెస్

Kannappa Movie Team Birthday Wishes to Akshay Kumar

  • నేడు న‌టుడు అక్ష‌య్ కుమార్ పుట్టిన‌రోజు
  • 'క‌న్న‌ప్ప' చిత్రంలో శివుడి పాత్ర‌లో న‌టిస్తున్న బాలీవుడ్ ఖిలాడీ 
  • ఆయ‌న‌కు ఎక్స్ వేదిక‌గా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన చిత్రం యూనిట్‌

టాలీవుడ్ న‌టుడు మంచు విష్ణు టీమ్‌ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. అలాగే మోహన్‌బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా కీ రోల్‌ చేస్తున్నాడు. శివుడి పాత్ర‌లో అక్ష‌య్ క‌నిపించ‌బోతున్నాడు. ఇవాళ ఈ బాలీవుడ్ ఖిలాడీ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌ప్ప చిత్రం యూనిట్ ఆయ‌న‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది.  

"హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్షయ్ కుమార్. ఈ చిత్రంలో మీరు శివుని పాత్ర పోషించడం మీ అచంచలమైన అంకితభావానికి నిదర్శనం" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు శివుడి పాత్ర‌ధారి అక్ష‌య్ కుమార్ తాలూకు ఓ ఫొటోను కూడా జోడించింది. కాగా, అక్షయ్‌కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలాఉంటే.. క‌న్న‌ప్ప మూవీ నుంచి ఇప్ప‌టికే వివిధ పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా, వాటిపై మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో ఈ సినిమాపై మూవీ యూనిట్‌ మంచి అంచ‌నాలు పెట్టుకుంది. మంచు విష్ణు కూడా చిత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఆశాభావంతో ఉన్నాడు.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.

  • Loading...

More Telugu News