Karnataka: కళ్ల ముందే అమ్మకు యాక్సిడెంట్.. ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి!

Auto Accident In Mangalore Girl Saves Her Mother

  • కర్ణాటకలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన ఆటో
  • ఆటో మీద పడడంతో మహిళకు గాయాలు
  • వెంటనే పరిగెత్తుకు వచ్చి ఆటోను లేపిన బాలిక

కళ్ల ముందే కన్నతల్లికి ప్రమాదం జరిగితే ఓ బాలిక చాకచక్యంగా వ్యవహరించింది. ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు తన చిన్ని చేతులతో ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా తోడవడంతో తల్లిని బయటకు తీసిందా బాలిక.. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ప్రమాదం కిన్నిగోళి రామనగర్ లో చోటుచేసుకుందని తెలుస్తోంది. రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించిందో తల్లి.. రోడ్డు మధ్యలోకి వచ్చాక దూసుకొస్తున్న ఆటోను గమనించింది. దీంతో రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టింది. చివరి క్షణంలో మహిళను గమనించిన ఆటో డ్రైవర్ ఆమెను తప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆటో వేగంగా వెళుతుండడంతో బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు. దీంతో హ్యాండిల్ ను పక్కకు తిప్పి మహిళను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు.

అతి వేగం కారణంగా ఆటో సదరు మహిళను ఢీ కొట్టి బోల్తా పడింది. ఆటో మీద పడడంతో మహిళ కేకలు పెట్టింది. ఇదంతా చూసి షాక్ కు గురైన బాలిక.. క్షణాలలో తేరుకుంది. అమ్మను కాపాడుకోవడానికి పరుగెత్తుకెళ్లి ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆటోలో ఉన్న ప్రయాణికులు బయటపడి బాలికకు సాయం చేశారు. ఆటోను పైకి లేపి మహిళను కూర్చోబెట్టారు. గాయాలపాలైన మహిళను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

Karnataka
Auto Accident
Girl
Mother
Viral Videos

More Telugu News