Nadendla Manohar: క‌ష్ట‌స‌మ‌యంలో ఇలాంటి ప‌నులేంటి.. మంత్రి నాదెండ్ల మ‌నోహర్ సీరియ‌స్‌!

Minister Nadendla Manohar Warning about Necessary commodities Sales

  • వ్యాపార‌స్తులు నిత్యావ‌స‌ర స‌రుకులను ఎంఆర్‌పీ రేటుకు మించి విక్ర‌యిస్తే కేసులు పెడ‌తామ‌న్న మంత్రి
  • ఈ క‌ష్ట‌స‌మ‌యంలో జ‌నాల‌ను ఇబ్బంది పెట్టొద్దని వ్యాపార‌స్తుల‌కు వార్నింగ్‌
  • వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్కరికి స‌రుకులు అంద‌జేస్తామ‌న్న మంత్రి నాదెండ్ల‌

నిత్యావ‌స‌ర స‌రుకుల విక్ర‌యాల విష‌యంలో వ్యాపార‌స్తులు అనుస‌రిస్తున్న ధోరిణిపై రాష్ట్ర పౌర‌స‌రఫ‌రాల మంత్రి నాదెండ్ల మ‌నోహర్ సీరియ‌స్ అయ్యారు. వ్యాపార‌స్తులు నిత్యావ‌స‌రాల‌ను ఎంఆర్‌పీ రేటుకు మించి విక్ర‌యిస్తే కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. 

ఇబ్ర‌హీప‌ట్నం ఫెర్రీ, గుంటుప‌ల్లి గ్రామ ఆర్‌సీఎం చ‌ర్చి, తుమ్మ‌ల‌పాలెంలో ప్ర‌భుత్వం అందిస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ క‌ష్ట‌స‌మ‌యంలో అంద‌రూ నిజాయతీతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని తెలిపారు. 

వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌తి బాధిత కుటుంబానికి స‌రుకులు అందేలా చర్య‌లు తీసుకున్న మంత్రి.. ఎవ‌రైనా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డితే కేసులు న‌మోదు చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌తి ఒక్కరికి స‌రుకులు అంద‌జేస్తామ‌ని, ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌వ‌లసిన అవ‌స‌రం లేద‌న్నారు.

  • Loading...

More Telugu News