Leopard: చిరుత ఇంకా రాజమండ్రి శివార్లలోనే ఉంది... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్ఓ భరణి

DFO Bharani said leopard still in Rajahmundry suburb areas

  • రాజమండ్రి శివార్లలో చిరుత కలకలం
  • రేడియో స్టేషన్ లో కనిపించిన చిరుత
  • 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది
  • దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత కదలికలు గుర్తించామన్న డీఎఫ్ఓ

రాజమండ్రిలో చిరుతపులి కలకలం కొనసాగుతోంది. రాజమండ్రి శివార్లలోని ఆల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద చిరుతపులి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ పందిని వెంటాడుతూ చిరుత రేడియో కేంద్రంలోకి ప్రవేశించింది. 

దీనిపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) భరణి స్పందించారు. ఆ చిరుత ఇంకా రాజమండ్రి శివారు ప్రాంతాల్లోనే సంచరిస్తోందని వెల్లడించారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పులి కదలికలు గుర్తించామని చెప్పారు. చిరుతను గుర్తించేందుకు 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 

చిరుత సంచారం నేపథ్యంలో, రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని డీఎఫ్ఓ భరణి సూచించారు. రాత్రివేళ పొలాల్లో ఒంటరిగా పడుకోవద్దని స్పష్టం చేశారు.

More Telugu News