GST: రేపే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఊరట దక్కేనా?

54th GST Council Meeting Tomorrow What Can You Expect

  • విదేశీ విమానయాన సంస్థలపై భారం తగ్గిస్తారా?
  • క్యాన్సర్ రోగులు వాడే మందులపై పన్ను తగ్గించే అవకాశం
  • జీఎస్టీ కాంపెన్సెషన్ సెస్ కొనసాగింపు!

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ సోమవారం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో అధికారులు సమావేశమై జీఎస్టీకి సంబంధించి పలు మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీలో కొన్ని అంశాలకు మినహాయింపులు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మీటింగ్ ఎజెండా ఏంటనేది అధికారులు వెల్లడించనప్పటికీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార వర్గాలు, నిపుణుల అభిప్రాయాల మేరకు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో చర్చకు వచ్చే పలు అంశాలు ఇవే..

  • హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఇది సరికాదంటూ సాక్షాత్తూ కేంద్ర మంత్రులే ఇటీవల పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపైనా రివ్యూ జరిగే అవకాశం ఉందంటున్నారు.

  • జీఎస్టీ కాంపెన్సెషన్ సెస్ ను కొనసాగించడంపై చర్చ.. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చే యోచన
  • విదేశీ విమానాయాన సంస్థలకు జీఎస్టీ భారం తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
  • క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పలు మందులు, ఎలక్ట్రిసిటీ మీటర్ సర్వీసులకు జీఎస్టీ తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం
  • రియల్ ఎస్టేట్, లోహ పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని, దీనిపై జీఎస్టీ కౌన్సిల్ చర్చ జరపనుందని తెలుస్తోంది
  • పైన్ ల్యాబ్స్, రోజార్ పే వంటి పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి జీఎస్టీ నిబంధనలపై స్పష్టతనిచ్చే అవకాశం. ప్రస్తుతం ఈ అగ్రిగేటర్ల ద్వారా చెల్లించే చిన్న మొత్తాల (రూ.2 వేల లోపు) పై ఎలాంటి జీఎస్టీ విధించడంలేదు. ఇకపై ఈ లావాదేవీలపైనా 18 శాతం జీఎస్టీ విధించే యోచనపై చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News