CV Anand: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

IPS transferred in Telangana

  • విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ
  • ఏసీబీ డీజగా విజయ్ కుమార్ బదిలీ
  • పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్ బదిలీ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయనను హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ గతంలోనూ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని, ఏసీబీ డీజీగా 1997 బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పోలీస్ సిబ్బంది-సంక్షేమం విభాగం అదనపు డీజీగా మహేశ్ భగవత్‌కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేశ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మహేశ్ భగవత్, రమేశ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.

CV Anand
IPS
Telangana
  • Loading...

More Telugu News