Natasa Stankovic: ముంబైకి వచ్చి హాట్ పోజులిస్తున్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్

Natasa Stankovic Looks Her Sexiest

  • హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత సెర్బియాకు నటాషా
  • ఈ వారం మొదట్లో కొడుకుతో కలిసి ముంబైలో అడుగుపెట్టిన నటి
  • అగస్త్యను పాండ్యాకు అప్పగించాక ఫొటో షూట్లు
  • హాట్ హాట్ ఫొటోలతో మోతెక్కిపోతున్న ఇన్‌స్టాగ్రామ్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియా వెళ్లిపోయిన నటాషా స్టాంకోవిక్ ఇటీవల కుమారుడు అగస్త్యతో కలిసి ముంబైలో అడుగుపెట్టింది. అనంతరం కుమారుడిని హార్దిక్ పాండ్యాకు అప్పగించిన నటాషా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఆమె అభిమానుల మతులు పోగొడుతున్నాయి. పక్షి ఈకలు అద్దిన ఈ వైట్ థై గౌన్‌, మ్యాచింగ్ హాల్స్ ధరించిన నటాషా హాట్‌గా దర్శనమిచ్చింది.

ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడమే ఆలస్యం అన్నట్టు ఆ వెంటనే వైరల్ అయ్యాయి. యూజర్లు కామెంట్లతో ఇన్‌స్టాను హోరెత్తించారు. ‘హాటెస్ట్’ అని ఒకరు అంటే ‘అద్భుతంగా ఉన్నారు’ అని మరికొరు కామెంట్లతో పోటీపడ్డారు. 

నటాషా, హార్దిక్ మే 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.  ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరోమారు పెళ్లాడారు. జులై 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే, కుమారుడు అగస్త్యకు తామిద్దరం కో పేరెంట్స్‌గా కొనసాగుతామని చెప్పారు.  ఆ తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా ఈ వారం మొదట్లో ముంబైలో అడుగుపెట్టింది. అనంతరం కుమారుడిని హార్దిక్‌కు అప్పగించింది. ఇప్పుడిలా హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తోంది.

Natasa Stankovic
Hardik Pandya
Natasa Photo Shoot
Mumbai
Serbia
  • Loading...

More Telugu News