CM Revanth Reddy: కీలక వ్యక్తికి విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్

akunuri murali is the chairman of telangana education commission

  • తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి
  • వ్యవసాయ, బీసీ కమిషన్ చైర్మన్లుగా కోదండ రెడ్డి, జి నిరంజన్ నియామకం
  • బీసీ కమిషన్ డైరెక్టర్లుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను నియమించిన రేవంత్ సర్కార్

తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుండి సాంకేతిక విద్య, యూనివర్శిటీ స్థాయి వరకూ నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నూతనంగా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ కమిషన్ నిర్వహణ బాధ్యతలను రేవంత్ సర్కార్.. ఓ కీలక వ్యక్తికి అప్పగించింది.
 
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో వ్యవసాయ, బీసీ కమిషన్ కు చైర్మన్ లను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ గా జి.నిరంజన్ లను నియమించింది. బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలను నియమించారు.

More Telugu News