Mahesh Kumar Goud: పీసీసీ చీఫ్‌గా నియామకం... సోనియా, ఖర్గేలకు కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud thanks to Sonia Gandhi and Kharge

  • పార్టీ అగ్రనాయకులు తనపై విశ్వాసం ఉంచారన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలకూ కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ కుమార్
  • తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించిన అధిష్ఠానం

తనను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలకు మహేశ్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. 

పార్టీ అగ్రనాయకులు తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు, వాలంటీర్లకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం జులై 7తో ముగిసింది. సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించింది. పీసీసీ అధ్యక్ష పదవికి మధుయాష్కీ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, బలరాం నాయక్ పోటీ పడ్డారు.

More Telugu News