Jagan: వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించిన జగన్

Jagan annoinced presidents to YCP affliated wings

  • ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి దారుణ ఫలితాలు
  • పార్టీకి కొత్త రూపు కల్పిస్తున్న జగన్
  • వివిధ విభాగాలకు కొత్త అధ్యక్షుల నియామకం

ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చవిచూసిన వైసీపీకి కొత్త రూపు కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సంకల్పించారు. వైసీపీ అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు. పలు జిల్లాల్లోనూ పార్టీకి కొత్త అధ్యక్షులను నియమించారు. 

ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో... వైసీపీ రాష్ట్ర ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలత రెడ్డిని నియమించారు. వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా బొల్లవరపు జాన్ వెస్లీని నియమించారు. ఈ మేరకు జగన్ ఆదేశించారు. 


ఇక, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (న్యాయ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆళ్ల మోహన్ సాయిదత్ ను పార్టీ నిర్మాణంలో జగన్ కు సలహాదారుగా నియమించారు. వీరిద్దరి నియామకాలను నిన్న ప్రకటించారు. 

అటు, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తి (చిట్టిబాబు)ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమించారు. 

ఇవే కాకుండా, వివిధ కులాల వైసీపీ విభాగాలకు కూడా అధ్యక్షులను నియమించారు.

  • Loading...

More Telugu News