Revanth Reddy: ఏపీని, తెలంగాణను ఒకేలా చూడండి: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Revanth Reddy appeals to Union Minister Shivraj Singh

  • తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి
  • ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అలాగే చేయాలన్న సీఎం
  • ఎన్డీఆర్ఎఫ్ నిధుల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణకు తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అలాగే చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాలను ఒకేలా చూడాలని కోరారు. సచివాలయంలో కేంద్రమంత్రికి వరద ప్రభావం నష్టంపై ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్రమంత్రిని కోరారు.

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకేరోజు 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించారు. వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రోడ్లు, ఇళ్లు,  బ్రిడ్జిలు చాలా వరకు దెబ్బతిన్నాయన్నారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రాష్ట్రం రూ.10 వేలు ఇస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

  • Loading...

More Telugu News