SV Krishna Reddy: రాజేంద్రప్రసాద్ తో గొడవ గురించి ఇప్పుడు ఎందుకు?: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy Interview

  • 'మాయలోడు' మూవీ ఓ సూపర్ హిట్ 
  • హీరోగా చేసిన రాజేంద్రప్రసాద్ 
  • ఆ సమయంలోనే సమస్య వచ్చిందన్న కృష్ణారెడ్డి 
  • రాజేంద్రప్రసాద్ చాలా మంచివాడని వ్యాఖ్య
     


ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్ ఆరంభంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'మాయలోడు' . 'రాజేంద్రుడు గజేంద్రుడు' కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలలోను కథానాయకుడు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత కృష్ణారెడ్డి నుంచి చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో రాజేంద్ర ప్రసాద్ మాత్రం కనిపించలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ఒక ప్రచారం అప్పటి నుంచి ఉంది. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న కృష్ణారెడ్డికి ఎదురైంది. 

అందుకు కృష్ణ రెడ్డి స్పందిస్తూ .. "ఆయన మంచివాడే కావొచ్చు .. నేను మంచివాడిని కావొచ్చు .. అయినా చిన్నచిన్నవేవో ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకూ?. రాజేంద్రప్రసాద్ చాలా మంచివాడు, అందువల్లనే ఇటీవల నేను చేసిన 'ఆర్గానిక్ మావ .. ' సినిమాలోను ఆయన చేశాడు. మా మధ్య 'మాయలోడు' సినిమా సమయంలో సమస్య వచ్చింది" అని అన్నారు. 

"ఆ తరువాత నేను ఆయనతో సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత 'సరదా సరదాగా' లాంటి సినిమా ఏదో  మొదలుపెట్టినప్పుడు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. చాలా మంచివాడు .. కాకపోతే కొంచెం ఈగోనో ఇంకొకటో ఉంటాయి. బ్రతిమాలుకుని చేయించుకోవాలంతే. ఇక అలీతో 'యమలీల' అనుకున్నప్పుడు, తాము చేస్తామని పెద్ద హీరోలు ముందుకు వచ్చారు. కానీ నేను అలీతోనే చేస్తానని చెప్పాను. అలీతో చేయడానికి సౌందర్య వెనకాడితేనే ఇంద్రజను తీసుకున్నాను" అని అన్నారు.

More Telugu News