Vaddepalli Krishna: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత

Tollywood lyric writer passes away

  • ఈ ఉదయం కన్నుమూసిన వడ్డేపల్లి కృష్ణ
  • తొలుత పోస్ట్ మేన్ గా పని చేసిన కృష్ణ
  • తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వడ్డేపల్లి

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం గమనార్హం. ఈ సంతోషకర సమయంలో ఆయన కన్నుమూశారు. 

వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. తొలుత పోస్ట్ మేన్ గా ఉద్యోగం చేశారు. దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఎక్కడకి వెళుతుందో మనసు' సినిమాలో సాయికుమార్ హీరోగా నటించారు. 'బలగం' సినిమాలో వడ్డేపల్లి నటించారు. 

ఆయన రాసిన వందలాది లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News