Mokshagnya: బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరింది!

Nandamuri Lokshagnya first look

  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ అరంగేట్రం
  • మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
  • 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు, జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 'హనుమాన్' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు 'వావ్' అంటున్నారు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు... హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Mokshagnya
Balakrishna
Tollywood
First Look
  • Loading...

More Telugu News