Non Veg Food: స్కూలుకు మాంసాహారం తీసుకొచ్చి.. మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడట.. నర్సరీ విద్యార్థి సస్పెన్షన్.. వీడియో ఇదిగో!

UP school principal suspends nursery student for bringing non veg food

  • ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఘటన
  • వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
  • ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందం ఏర్పాటు
  • దర్యాప్తు అనంతరం చర్యలు ఉంటాయన్న పోలీసులు

మధ్యాహ్న భోజనంగా తెచ్చిన మాంసాహారాన్ని తోటి విద్యార్థులతో తినిపిస్తూ మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడంటూ నర్సరీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిని స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ విషయంలో విద్యార్థి తల్లికి, స్కూల్ ప్రిన్సిపాల్‌కు మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఆలయాలను కూల్చేసి, స్కూలుకు నాన్ వెజ్ తెచ్చే ఇలాంటి పిల్లలకు నీతులు నేర్పడం తమకు ఇష్టం లేదని బాలుడి తల్లితో ప్రిన్సిపాల్ వాదించడం వీడియోలో కనిపిస్తోంది. మాంసాహారాన్ని అందరితో తినిపించాలని, వారిని ఇస్లాంలోకి మార్చాలని కూడా బాలుడు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. స్కూలుకు నాన్ వెజ్ తెచ్చిన విషయాన్ని బాలుడు అంగీకరించాడని తెలిపారు.

ప్రిన్సిపాల్ ఆరోపణలను విద్యార్థి తల్లి ఖండించారు. ఏడేళ్ల బాలుడు ఇలాంటి విషయాలు మాట్లాడతాడా? అని ప్రశ్నించింది. దీనికి ప్రిన్సిపాల్ బదులిస్తూ.. ఇలాంటివి అన్నీ పిల్లలు ఇంట్లో తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారని పేర్కొన్నారు. అతడితో సమస్య ఉంది కాబట్టే స్కూలు నుంచి తొలగించినట్టు చెప్పారు. దీనికి ఆ మహిళ స్పందిస్తూ.. దేశంలోని హిందూ ముస్లిం సమస్యలపై పాఠశాల విద్యార్థులు కూడా చర్చించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, తన కుమారుడిని మరో కుర్రాడు తరచూ కొడుతున్నట్టు మహిళ ఆరోపించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రిన్సిపాల్ విషయాన్ని ఆమె పక్కదోవ పట్టిస్తున్నట్టు ఆరోపించారు.

  • Loading...

More Telugu News