KL Rahul: 634 రోజుల తర్వాత టెస్టు జట్టులోకి 26 ఏళ్ల భారత స్టార్ ఆటగాడు!

No KL Rahul In India Squad For Bangladesh Test Series Rishabh Pant

  • ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్
  • కేఎల్ రాహుల్‌కు నో చాన్స్
  • సుదీర్ఘ కాలం తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ ఆడనున్న పంత్
  • బుమ్రాకు రెస్ట్.. మూడో బౌలర్‌గా అర్షదీప్ లేదంటే ఆకాశ్‌దీప్

వెస్టిండీస్‌తో రెండో టెస్టు సిరీస్‌తో 90 రోజుల విరామం తర్వాత భారత జట్టు తిరిగి యాక్షన్ లోకి దిగబోతోంది. ఈ నెల 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో ఇది తొలి టెస్ట్ సిరీస్ కాగా, ఈ ఏడాది మొత్తం 10 టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మూడో బౌలర్‌గా ఎవరు?
ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో 634 రోజులుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉన్న రిషభ్‌పంత్‌కు జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు కూడా చోటు పక్కా అని తెలిసింది. ఈ రోజు ప్రారంభమైన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి జట్టు ఎంపిక ఉంటుందని కూడా సమాచారం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వనున్నారు. బౌలర్లు మహమ్మద్ షమీ, ముకేశ్ కుమార్‌లతో జట్టు బరిలోకి దిగనుంది. అలాగే, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరికి మూడో బౌలర్‌గా చాన్స్ దక్కనుంది. 

జట్టు కూర్పు ఇలా ఉండే అవకాశం
రోహిత్‌శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్‌ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్‌పంత్ (వికెట్ కీపర్), శుభమన్‌గిల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్/అర్షదీప్‌సింగ్

  • Loading...

More Telugu News