Duleep Trophy: దులీప్ ట్రోఫీకి ఇషాన్ కిషన్ దూరం.. ఎందుకో చెప్పిన బీసీసీఐ

Ishan Kishan Surya and Prasidh Krisha out from Duleep Trophy

  • ప్రారంభమైన దులీప్ ట్రోఫీ
  • బెంగళూరు, అనంతపురంలో ప్రారంభమైన మ్యాచ్‌లు
  • గాయం కారణంగా సూర్యకుమార్, ప్రసిద్ధ కృష్ణ కూడా జట్లకు దూరం

దులీప్‌ ట్రోఫీ కోసం గతంలో ప్రకటించిన జట్లలో బీసీసీఐ కొన్ని మార్పులు చేసి కొత్త ఆటగాళ్లను ప్రకటించింది. నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఇప్పటికే బెంగళూరులో ఇండియా ఎ - ఇండియా బి జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఇండియా డి - ఇండియా సి జట్ల మధ్య అనంతపురంలో మరో మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ జట్లకు దూరమయ్యారు.  

బుచ్చిబాబు టోర్నీలో గాయం
రెడ్‌బాల్ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఝార్ఖండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఇషాన్ గత నెలలో సెంచరీ నమోదు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ నుంచి వైదొలగిన తర్వాతి నుంచి టెస్టు జట్టులో చోటు కోసం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తహతహలాడుతున్నాడు. అయితే, రంజీ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించి వార్తల్లోకి ఎక్కాడు. దేశవాళీ టోర్నీలో ఆడేందుకు నిరాకరించడంతో బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రక్ట్‌ను రద్దు చేసింది. దీంతో అతడు దులీప్ ట్రోఫీ అడేందుకు అంగీకరించాడు. అయితే, ఆల్ ఇండియా బుచ్చిబాబు టోర్నీలో గాయపడిన ఇషాన్ దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు అందుబాటులో ఉండడం లేదని బోర్డు ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీం అతడిని పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది.  

సంజు శాంసన్‌తో భర్తీ
దులీప్ ట్రోఫీ కోసం తొలుత ప్రకటించిన 61 మంది ఆటగాళ్లలో కనిపించని సంజుశాంసన్.. ఇషాన్ వైదొలగడంతో జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ-డి జట్టు తరపున అతడు ఆడనున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణన్ కూడా ఈ టోర్నీకి దూరమయ్యారు. గత నెలలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడి కుడిచేతి బొటనవేలు బెణికిందని బీసీసీఐ తెలిపింది. ఈ టోర్నీ రెండో రౌండ్‌కు సూర్య అందుబాటులో ఉండడం సందేహంగానే ఉంది. ఇక, గాయంతో బాధపడుతూ ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం పునరావాసంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు కూడా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News