Jay Shah: అమిత్ షా తనయుడు జై షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

rahul gandhi comments on jay Shah

  • జీవితంలో క్రికెట్ బ్యాట్ పట్టని జై షాకు క్రికెట్ లో అత్యున్నత పదవి అంటూ రాహుల్ వ్యాఖ్యలు
  • ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారంటూ విమర్శలు 
  • సోషల్ మీడియాలో రాహుల్ వ్యాఖ్యల వీడియో వైరల్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ అంశాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. అమిత్ షా కుమారుడు జై షాపై సంచలన ఆరోపణలు చేశారు. 

జై షా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్ లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్ లో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోనూ పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
‘ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారు. అమిత్ షా కుమారుడు జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టలేదు. కానీ అతడు మాత్రం క్రికెట్ కు ఇన్ చార్జిగా ఉన్నాడు’ అంటూ రాహుల్ దెప్పిపొడిచారు.

Jay Shah
Rahul Gandhi
Social Media
Amit Shah

More Telugu News