Virat Kohli: 2023-24లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన క్రికెట‌ర్ల‌లో కోహ్లీదే అగ్ర‌స్థానం!

Virat Kohli Tops List Among Sportspersons with Rs 66 Crore Tax In 2023 and 2024

  • 2023-24లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెలెబ్రిటీల‌ జాబితాతో ఫార్చ్యూన్ ఇండియా నివేదిక‌
  • క్రీడాకారులలో రూ. 66 కోట్ల పన్ను చెల్లింపుతో అగ్ర‌స్థానంలో కింగ్ కోహ్లీ
  • ఆ త‌ర్వాతి స్థానాల్లో ధోనీ (రూ. 38 కోట్లు), సచిన్ (రూ. 28 కోట్లు), గంగూలీ (రూ. 23 కోట్లు)
  • ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో రూ. 80 కోట్ల పన్ను చెల్లింపుతో అగ్రస్థానంలో తలపతి విజయ్

2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెలెబ్రిటీల‌ జాబితాను తాజాగా ఫార్చ్యూన్ ఇండియా విడుద‌ల చేసింది. ఈ నివేదిక ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ రూ. 66 కోట్ల పన్ను చెల్లించాడు. ఇదే క్రీడాకారులలో అత్యధికం. దీంతో విరాట్ ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 

అలాగే భార‌త‌ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (రూ. 38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే, రూ. 80 కోట్ల పన్ను చెల్లింపుతో త‌మిళ‌ నటుడు తలపతి విజయ్ ఓవరాల్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 

ప్రస్తుతం క్రికెట్‌కు విరామం ఇచ్చిన విరాట్ కోహ్లీ.. లండ‌న్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న విష‌యం తెలిసిందే. అతను చివరిసారిగా ఇటీవ‌ల‌ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కనిపించాడు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో విరాట్ తిరిగి జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉంది. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ర‌న్‌మెషిన్.. వ‌న్డే, టెస్టుల‌లో మాత్ర‌మే ఆడ‌నున్నాడు.

  • Loading...

More Telugu News