Australia: పసికూన స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా పెనువిధ్వంసం.. రికార్డులు బద్దలు

Australia scored 113 in the Powerplay that is most by a team in T20I

  • పవర్‌ప్లేలో ఒక వికెట్ నష్టానికి 113 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
  • పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా అవతరణ
  • 25 బంతుల్లోనే 80 పరుగులు సాధించిన ట్రావిస్ హెడ్

వరల్డ్ క్రికెట్‌లో రికార్డులకు మారుపేరైన ఆస్ట్రేలియా మరో చారిత్రాత్మక మ్యాచ్‌ను నమోదు చేసింది. బుధవారం ఎడిన్‌బర్గ్‌ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్ పెను విధ్వంసం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసి స్కాట్‌లాండ్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బ్యాటర్లు కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించారు. దూకుడుగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 6 ఓవర్ల పవర్‌ప్లే‌లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఏకంగా 113 పరుగులు పిండుకున్నారు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

ఇక ఆసీస్ పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా73 పరుగులు బాదాడు. దీంతో పవర్‌ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై హెడ్ స్పందిస్తూ.. గత రెండేళ్లుగా తన టైమ్ బావుందని, ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 25 బంతులు ఎదుర్కొని 80 పరుగులు సాధించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించింది.

టీ20లలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు ఇవే..

1. స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా -113/1 (2024)
2. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 102/0 (2023)
3. శ్రీలంకపై వెస్టిండీస్ 98/4 (2021)
4. ఐర్లాండ్‌పై వెస్టిండీస్ 93/0 (2020).

More Telugu News