MK Stalin: షికాగోలో సైకిల్ తొక్కిన స్టాలిన్... స్పందించిన రాహుల్ గాంధీ

Stalin Cycles Along Chicago Shoreline

  • సైకిల్ తొక్కిన వీడియోను షేర్ చేసిన స్టాలిన్
  • చెన్నైలో ఎప్పుడు సైక్లింగ్ చేద్దామని రాహుల్ గాంధీ ప్రశ్న
  • మీకు వీలున్నప్పుడు చెన్నైని చుట్టేద్దామన్న స్టాలిన్

అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అక్కడ తాను సైకిల్ తొక్కిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ... సోదరా, మనం ఇద్దరం చెన్నైలో ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం? అంటూ స్టాలిన్ ను సరదాగా ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్టాలిన్ ప్రతిస్పందించారు. "డియర్ బ్రదర్ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్ తొక్కుతూ చెన్నై నగరాన్ని చుట్టేద్దాం. మీ కోసం స్వీట్స్ కూడా వేచి చూస్తున్నాయి. సైక్లింగ్ తర్వాత మా ఇంట్లో దక్షిణాది వంటకాన్ని ఆస్వాదించడంతో పాటు స్వీట్ల రుచి చూద్దాం" అని పేర్కొన్నారు.

తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా స్టాలిన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తీరిక సమయంలో షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ "కొత్త కలలకు సంధ్యా సమయం వేదికగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.

MK Stalin
Tamil Nadu
USA

More Telugu News