Chandrababu: ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu thanked PM Modi and Amit Shah

  • ఏపీలో వరద నష్టం అంచనాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
  • ప్రత్యేక బృందాన్ని స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు
  • వారు చేసే సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి 

ఏపీలో వరద పరిస్థితులపై సత్వరమే స్పందించారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

వరద బాధితులకు తక్షణ సాయం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రాకను స్వాగతిస్తున్నామని, వారు చేసే సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. 

కాగా, ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు, తగిన సిఫారసులు చేసేందుకు కేంద్రం నేడు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు.

More Telugu News