Pawan Kalyan: 'హైడ్రా'పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan interesing comments on HYDRA

  • హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా
  • బుడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తెచ్చిన పవన్
  • హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది రైటేనని వెల్లడి

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. హైదరాబాదులో అక్రమ నిర్మాణాల అంతు తేల్చుతున్న ఈ వ్యవస్థ, కబ్జాదారుల పాలిట సింహస్వప్నంలా మారింది. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకువచ్చారు. 

"బుడమేరు పరీవాహక ప్రాంతం అంతా ఇళ్లు కట్టేశారు. ఈ విషయంలో సంబంధింత యంత్రాంగానికి, మున్సిపాలిటీకి, పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది. హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి వీటన్నింటినీ తొలగించవచ్చు. కానీ కొన్ని సమస్యలు వస్తాయి.

హైదరాబాద్ లో చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టడం చూశాను. ఇబ్బందులు రావా అనుకునేవాడ్ని! అన్నీ కట్టేసిన తర్వాత కూల్చేయడం కాదు... ఇలాంటి వాటిని ముందే నివారించేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులు వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించాలి. 

ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాక అక్రమ నిర్మాణాలను కూలగొట్టేస్తామంటున్నారు. ఆయన చేస్తున్నది రైటే. అయితే మనం కూడా ఇలాగే వ్యవహరించాలంటే... అనేక సామాజిక సమస్యలు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని పవన్ కల్యాణ్ వివరించారు.

More Telugu News