HYDRA: మాజీ మేయర్ మేకల కావ్య అనుమతుల్లేకుండా ఫాంహౌస్ నిర్మించింది: హైడ్రా

HYDRA commissioner inspects in Jawahar Nagar

  • జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
  • చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా కబ్జాకు గురైనట్లు గుర్తించిన అధికారులు
  • పేదలను వదిలేసి... పెద్దల అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామన్న కమిషనర్

మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతులు లేకుండా నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేడు జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేడ్కర్ నగర్‌లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా కబ్జాకు గురైనట్లు గుర్తించారు.

మేకల కావ్య తన ఫాంహౌస్‌ను అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరు అనే విషయమై ఆరా తీశారు. ఫాంహౌస్‌లకు అనుమతులు లేకపోవడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

అనుమతులు లేకుండా నిర్మించిన పెద్దల ఫాంహౌస్‌లతో పాటు అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చేస్తామని తేల్చి చెప్పారు. పేదలను మినహాయించి బడాబాబుల నిర్మాణాలు కూల్చేస్తామన్నారు. పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News