Telangana Floods: ప్రభాస్, రామ్ చరణ్, నారా భువనేశ్వరిలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy thanked Prabhas and others who contributed for flood victims

  • తెలంగాణలో వరద బీభత్సం
  • లక్షలాది మందిపై వరద ప్రభావం 
  • ఉదారంగా స్పందించిన సినీ హీరోలు, ఇతర రంగాల ప్రముఖులు

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద బీభత్సం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిత్ర పరిశ్రమ ఉదారంగా స్పందించింది. అగ్ర హీరోలు భారీ విరాళాలతో ముందుకు వచ్చారు. 

ప్రభాస్ రూ.1 కోటి, మెగాస్టార్ చిరంజీవి రూ.50 లక్షలు, రామ్ చరణ్ రూ.50 లక్షలు, అల్లు అర్జున్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో విరాళాలు ప్రకటించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ కొనియాడారు. 

కాగా, తెలంగాణ సీఎం సహాయ నిధికి వైజయంతీ మూవీస్ రూ.20 లక్షలు, యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రూ.10 లక్షలు విరాళాలు అందించారు. వీరందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

More Telugu News