Hamaresh: ఓటీటీలో అడుగుపెడుతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ!

Sathya Movie Update

  • తమిళంలో రూపొందిన 'రంగోలి'
  • 'సత్య' టైటిల్ తో తెలుగులోకి అనువాదం
  • ప్రధానమైన పాత్రలను పోషించిన హమరేశ్ - ప్రార్ధన   
  • ఈ నెల 7 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్


తమిళంలో ఆ మధ్య వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీస్ లో 'రంగోలి' సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. బాబురెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు. 2023 సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. సుందరమూర్తి అందించిన బాణీలు వాళ్లను ఆకట్టుకున్నాయి. 

అలాంటి ఈ సినిమాను తెలుగులోకి అనువదించి, 'సత్య' అనే టైటిల్ తో మే 10వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. తమిళంలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, తెలుగులో థియేటర్ల నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ కనిపించలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

తండ్రి మాట కాదనలేక ఓ కార్పొరేట్ కాలేజ్ లో సత్య ఇంటర్లో జాయినవుతాడు. అక్కడే అతనికి పార్వతి తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమె పట్ల అతను ఆకర్షితుడు అవుతాడు. ఆమెకూడా అతని పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుందిగానీ .. ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? దాంతో ఆ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది కథ.

  • Loading...

More Telugu News