Baladithya: శోభన్ బాబుగారి మాట ఇప్పటికీ మరిచిపోలేదు: బాలాదిత్య

Baladithya Interview

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన బాలాదిత్య
  • బాలనటుడిగా 41 సినిమాలు చేశానని వెల్లడి  
  • హీరోగా 11 సినిమాలు చేశానని వ్యాఖ్య 
  • శోభన్ బాబు క్రమశిక్షణ గురించిన ప్రస్తావన 

బాలాదిత్య .. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. బాలనటుడిగా 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం' సినిమా ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అలాంటి బాలాదిత్య ఆ తరువాత హీరోగానూ కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"బాలనటుడిగా నా కెరియర్ మొదలైంది. బాలనటుడిగా నాలుగైదు భాషలలో 41 సినిమాలు చేశాను. ఆ తరువాత 'చంటిగాడు' సినిమాతో హీరోగా మారాను. హీరోగా 11 సినిమాల వరకూ చేశాను. అప్పటి నుంచి కీలకమైన రోల్స్ చేస్తూ ముందుకు వెళుతున్నాను. సీనియర్ హీరోలతో కలిసి పనిచేయడం వలన, నటనతో పాటు వ్యక్తిత్వం పరంగా కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను" అని చెప్పాడు. 

"శోభన్ బాబుగారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన చాలా తక్కువగా తినేవారు. ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెప్పేవారు. జీవితంలో సమయం .. డబ్బు చాలా ముఖ్యమైనవనీ, వాటికి చాలా ప్రాధాన్యతను ఇవ్వాలని అనేవారు. ఆయన చెప్పిన కొన్ని మాటలను నేను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను" అని అన్నాడు.

More Telugu News