Spam Calls: 2.75 లక్షల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసిన టెలికాం కంపెనీలు

Telecom operators blacks lakhs of mobile numbers

  • జనవరి నుంచి జూన్ వరకు స్పామ్ కాల్స్ పై 7.9 లక్షల ఫిర్యాదులు
  • అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటీర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్
  • ట్రాయ్ ఆదేశాలతో కొరడా ఝళిపించిన టెలికాం కంపెనీలు

స్పామ్ కాల్స్, మెసేజ్ ల కట్టడికి కేంద్రం అధీనంలోని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాయ్ ఆదేశాల మేరకు స్పామ్ కాల్స్ ఏ మొబైల్ నెంబర్ల నుంచి వస్తున్నాయో గుర్తించిన టెలికాం కంపెనీలు... 2.75 లక్షల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేశాయి. 

స్పామ్ కాల్స్ చేస్తూ, స్పామ్ మెసేజ్ లు పంపుతున్న 50 సంస్థలను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు ట్రాయ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పామ్ కాల్స్ ద్వారా టెలికాం వనరులను దుర్వినియోగం చేస్తున్న వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలను అన్ని టెలికాం కంపెనీలు అమలు చేయాలని, తద్వారా స్వచ్ఛమైన టెలీ కమ్యూనికేషన్ల వ్యవస్థ ఏర్పడేందుకు తోడ్పాటు అందించాలని ట్రాయ్ పిలుపునిచ్చింది. 

కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు స్పామ్ కాల్స్ కు సంబంధించి 7.9 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే, అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది.

  • Loading...

More Telugu News