Kanna Lakshminarayana: కృష్ణా నది రిటైనింగ్ వాల్ కట్టించింది ఎవరు?... వైసీపీకి కౌంటర్ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ

Kanna counters YCP leaders on Krishna Lanka Retaining Wall

  • కృష్ణ లంక రిటైనింగ్ వాల్ కట్టింది తామే అంటున్న వైసీపీ నేతలు
  • మూడు నెలల్లోనే కట్టారా? అంటూ కన్నా ప్రశ్నాస్త్రం
  • ఆసక్తికర ఫొటోతో వైసీపీపై ఎదురుదాడి

తాము కట్టిన రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణా నది విజయవాడపై పొంగి పొర్లకుండా  ఆగిందని వైసీపీ నేతలు చెప్పుకోవడంపై సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ రిటైనింగ్ వాల్ పై నిలుచున్న ఓ పాత ఫొటోను కూడా కన్నా పంచుకున్నారు. 

"కృష్ణ లంక వద్ద రిటైనింగ్ వాల్ కట్టింది వైసీపీ అని ప్రచారం చేసుకుంటున్నారు కదా...! మరి మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి అదే కృష్ణ లంక రిటైనింగ్ వాల్ మీద నిలుచున్నారు... అది మీరు కట్టిందేనా? అని వైసీపీని ప్రశ్నించారు. 

ఆ ఫొటో 2019 ఆగస్టు 18న తీసిందని... వైసీపీ అధికారంలోకి వచ్చింది 2019 జూన్ లో అని కన్నా వెల్లడించారు. మరి మూడు నెలల్లోనే రిటైనింగ్ వాల్ కట్టారా? అని నిలదీశారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలకు తెర దించండి అని హితవు పలికారు.

More Telugu News