Vijayawada Floods: విజయవాడను మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టింది: మంత్రి పయ్యావుల

Payyavula said flood surrounded Vijayawada by three ways

  • కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడలో వరద
  • ఇప్పటికీ ముంపులోనే అనేక ప్రాంతాలు
  • కృష్ణా నది, బుడమేరు, మున్నేరు నుంచి ఒకేసారి వరద వచ్చిందన్న పయ్యావుల

గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకోవడంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. విజయవాడను మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టిందని వెల్లడించారు. కృష్ణా నదితో పాటు బుడమేరు, మున్నేరు నుంచి ఒకేసారి వరద నీరు వచ్చిందని వివరించారు. అందువల్లే నగరంలో ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. 

కాగా, జనజీవనం సాధారణ స్థితికి వచ్చేవరకు తమ ప్రభుత్వం విశ్రమించదని పయ్యావుల స్పష్టం చేశారు. విద్యుత్ కొరత ఎక్కడా లేదని, వరద ప్రాంతాల్లో ప్రమాదం ఉందని భావిస్తేనే విద్యుత్ కోతలు ఉంటాయని తెలిపారు.

More Telugu News