Fish Venkat: నడవలేని స్థితిలో నటుడు 'ఫిష్' వెంకట్!

Fish Venkat Special

  • నటుడిగా 'ఫిష్' వెంకట్ కి పేరు 
  • 100కి పైగా సినిమాలు చేసిన నటుడు 
  • రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని వెల్లడి 
  • అందుకే సినిమాలు చేయడం లేదని కన్నీళ్లు


'ఫిష్' వెంకట్ .. తెలుగు సినిమాతో పరిచయమున్న చాలామందికి ఈ పేరు తెలుసు. విలన్ గ్యాంగ్ కి సంబంధించినవారిలో ఒకరుగా తను ఎక్కువ సినిమాలలో నటించాడు. కామెడీ టచ్ ఉండే రౌడీ పాత్రల ద్వారా ఆయన ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీని ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అలా 100కి పైగా సినిమాలలో నటించిన 'ఫిష్' వెంకట్, ఈ మధ్య కాలంలో తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. 

ఏడాదిన్నర కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వల్లనే ఆయన సినిమాలకి దూరమయ్యాడనే విషయం 'సుమన్ టీవీ' ద్వారా బయటికి వచ్చింది. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితి గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.  కొన్ని రోజులుగా నడవడం కూడా కష్టమైపోతోందంటూ ఆవేదన చెందాడు.  

తన రెండు కిడ్నీలు దెబ్బ తిన్నాయనీ, ఏడాదిన్నరగా డయాలసిస్ జరుగుతోందని ఆయన అన్నాడు. గతంలో కాలుకి జరిగిన ఆపరేషన్ కూడా తనపై ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పాడు. తాను ఈ పరిస్థితిని ఇంతవరకూ ఎవరికి చెప్పుకోలేదని అన్నాడు. తనకి ఇద్దరు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల ఉన్నారనీ, మగపిల్లలు డబ్బు పరంగా ఎలాంటి సాయం చేయడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. 

Fish Venkat
Actor
Tollywood
  • Loading...

More Telugu News