KA Paul: విజయవాడ వరదలపై కేఏ పాల్ స్పందన

KA Paul visits flood hit areas in Vijayawada

  • విజయవాడలో వరద విలయం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో కేఏ పాల్ పర్యటన
  • గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యలు 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. వరదల కారణంగా ఇన్ని లక్షల మంది ఇళ్లు కోల్పోతారని అనుకోలేదని వెల్లడించారు. 

దాదాపు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అనుకుంటున్నారని, దీనిపై స్పష్టత లేదని తెలిపారు. ఏదేమైనా, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారని, కానీ ఆయన వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. ఈ వరదలు రావడానికి కారణం అక్రమ నిర్మాణాలు అని వ్యాఖ్యానించారు. 

తనవి మూడు డిమాండ్లు అని కేఏ పాల్ పేర్కొన్నారు. ప్రాణం పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలి... వరద బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, ఆశ్రయం అందించాలి... ఇక్కడ కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు అడిగి తీసుకోవాలి అని కేఏ పాల్ వివరించారు. అదానీ, అంబానీలకు లక్షల కోట్లు రుణ మాఫీ చేసినప్పుడు, రూ.10 వేల కోట్లు పెద్ద విషయం కాదన్నారు.

  • Loading...

More Telugu News